06-04-2025 12:07:17 AM
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): శిల్పారామం మాదాపూర్ లో శ్రీరామ నవమి సందర్బంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శనివారం అభినయ వాణి నృత్యనికేతన్ నాట్య గురువులు బాలాత్రిపురసుందరి శిష్య బృందంచే ‘భజ రామం‘ రామచంద్రమూర్తి పై వివిధ వాగేయకారులు రచించిన రామ కీర్తనలను సమర్పించారు.
రామాయణ శబ్దం, తక్కువేమి మనకు నగుమోము, మా రామచం ద్రునికి, శ్రీ రామ జయ రామ, కోదండ రాముడవై, కొలువైఉన్నడే అంశాలకు సంయుక్త, శశికళ, దీక్షితులు, నేత్ర, ప్రియా హాసిని, అంబికా, చరణ్, అనన్య, సంజన, ఇషితా, ఐశ్వర్య, మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.
నట్టువాంగం బాలత్రిపురసుందరి, గాత్రం శాస్త్రి, మ్రిదంగం రాజగో పాలాచారి, వయోలిన్ శివ కృష్ణ స్వరూప్, వేణువు మురళి, ఎఫెకట్స్ జయకుమారాచార్యలు సహకరించారు.