కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పదవి
హైదరాబాద్, నవంబర్ 16 (విజయ క్రాంతి): ప్రజా యుద్ధనౌక గద్దర్ కూతురు గుమ్మడి వెన్నెలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యే క గుర్తింపునిచ్చింది. ఉద్యమ గొంతుకలకు ఊతంగా నిలిచే ‘తెలంగాణ సాంస్కృతిక సారథి’కి చైర్‌పర్సన్‌గా గుమ్మడి వెన్నెలను నియమించింది.
ఈ మేరకు సాంస్కృతిక, పర్యాటక, యువజన సర్వీసులు శాఖ సెక్రటరీ శ్రీధర్ శనివారం ఉత్తర్వులు జారీచేశా రు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు, వర్క్‌షాపులు, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సాంస్కృతిక సారథి కళాకారులతో ప్రచారం చేయిస్తారు.
గత ప్రభుత్వం ఈ సంస్థను ఏర్పాటు చేసి చైర్మన్‌గా అప్పటి మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను నియమించింది. 2023 సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గద్దర్ కూతురు వెన్నెల ఓటమి పాలైన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం గుమ్మడి వెన్నెలకు చైర్ పర్సన్‌గా కీలక బాధ్యతలు అప్పగించారు.