* తెలంగాణ ప్రజా సాంసృ్కతిక కేంద్రం రాష్ర్ట అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 4 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ర్టంలోనే తొలి ప్రయ త్నంగా సుద్దాల హనుమంతు సాంస్కతి ఉత్సవాలు ఈనెల 5, 6 తేదీల్లో మహబూబ్ నగర్ జిల్లా బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ వేదికగా నిలుస్తున్నట్లు తెలంగాణ ప్రజా సాంస్కతిక కేంద్రం రాష్ర్ట అధ్యక్షులు భూపతి వెంకటే శ్వర్లు అన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సుశ్రుత ప్రజా వైద్యశాలలో మంగళవారం సాయంత్రం జరిగిన విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైవి ద్య భరిత కార్యక్రమాలు లేనందున విద్యార్థు ల్లో సజన కొ రవడుతోందని, ఆ లోటును భర్తీ చేయడానికి ఇలాంటి వేదికలు ఎంతో అవసరమవుతాయని, ఇందుకుగాను సంస్క తిక కమిటీ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.
సుద్దాల హను మంతు సాంసృ్కతిక ఉత్సవాల అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ అత్యున్నత విలువలను, కళల్ని యువతకు పరిచయం చేసేందుకే రేపటి నుంచి రెండు రోజులపాటు పది అంశాలపై యువతతో సాంస్కతిక కళా ప్రదర్శనలు పోటీలను చేప డుతున్నట్లు వెల్లడించారు.
ఈ పోటీలను స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బుధ వారం ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తా రని, పోటీల్లో విజేతలైన వారికి ప్రముఖ సినీ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ బహుమ తులను అందిస్తారని ఆయన వెల్లడించారు. సంస్కతిక ఉత్సవాల వేదిక అధ్యక్షులు బెక్కేం జనార్ధన్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ పట్టణంలోని కళాశాల విద్యార్థులు, యువత, పట్టణ ప్రజలు ఈ సాంస్కతిక ఉత్సవాలలో పాల్గొని, విజయవంతం చేయాలని ఆకాం క్షించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవాల కమి టీ ప్రధాన కార్యదర్శి వి కురుమూర్తి, ఉపా ధ్యక్షులు ఎం. కురుమయ్య పాల్గొన్నారు.