calender_icon.png 10 January, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్వదినాన్ని ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

10-01-2025 07:56:41 PM

భద్రాచలం (విజయక్రాంతి): ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని గోదావరిలో ఏరు (రివర్ ఫెస్టివల్) కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాయి. వివిధ పాఠశాలల విద్యార్థినిలచే నిర్వహించడం జరిగిందని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో రమాదేవి అన్నారు. శుక్రవారం  రాత్రి గోదావరి పరిసరాలలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదేశానుసారం గోదావరి ఘాట్ ప్రదేశాలలో ఏర్పాటుచేసిన వివిధ రకాల స్టాల్స్, గిరిజన వంటకాలు, గిరిజన కళాఖండాలు భక్తులు కొనుగోలు చేసుకుని అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలను తిలకించారు.

ఈరోజు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో ఆశ్రమ బాలికల పాఠశాల భద్రాచలం, ఆశ్రమ బాలికల పాఠశాల రేగుబల్లి, ఆశ్రమ బాలికల పాఠశాల రామచంద్రన్న పేట, కొండలరావు అభినయ నాట్య బృందం, నాట్య కళాకారుని వరలక్ష్మి శిష్య బృందం, విజయలక్ష్మి నాట్య శిశు బృందం, శ్రీ వనం శ్రీముఖి కృష్ణ శబ్దం బాలికలు నటించిన నాట్యాలను చూపరులకు ఎంతో ఆకట్టుకున్నాయని, భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాలను భక్తులతో కలిసి తిలకించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏటి డిఓ అశోక్ కుమార్, విజయం ఇంచార్జ్ వీరస్వామి, వివిధ పాఠశాలలకు చెందిన బాలబాలికలు తదితరులు పాల్గొన్నారు.