ఇద్దరి అరెస్టు, రెండు ఆటోలు సీజ్
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 30 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గల కూనవరం రోడ్డులో గల చెక్‌పోస్టు వద్ద బుధవారం అక్రమంగా తరలిస్తున్న రూ.31.50 లక్షల విలువైన 1.18 క్వింటాళ్ల గంజాయిని భద్రాచ లం ఎక్సైజ్ అధికారులు పట్టుకొన్నారు. ఎక్సైజ్ ఎస్సై గౌతమ్ తెలిపిన వివరాల ప్రకారం.. కూనవరం రోడ్డు లో బుధవారం వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో రెండు ఆటో లు అటుగా వస్తున్నాయి.
పోలీసులను చూసి ఆటోలో ఉన్న వ్యక్తి పరా రవ్వడంతో అనుమానం వచ్చి రెండు ఆటోలను తనిఖీ చేయగా 1.18 క్విం టాళ్ల గంజాయి లభించింది. ఆటో డ్రైవర్లను విచారించాగా ఒడిశా కలిమెల నుంచి హైదరాబాద్‌కు ఆటో లో గంజాయిని తరలిస్తున్నట్టు అంగీకరించారు. గంజాయి విలువ రూ. 31.50 లక్షలు ఉంటుందని తెలిపా రు. హైదరాబాద్‌కు చెందిన కనిగల సాత్విక్, మణుగూరుకు చెందిన గంజు ఆమోస్‌ను అరెస్టు చేశామని, ఇల్లెందుకు చెందిన సపావట్ వెంక న్న పరారీలో ఉన్నాడని తెలిపారు.