calender_icon.png 21 January, 2025 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోడు భూముల్లో పండ్లు తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలి

16-07-2024 05:25:17 PM

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఏసీలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అటవీ భూముల్లో డ్రోన్ సర్వే చేసి ఖాళీ స్థలంలో పండ్లు మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతలను గిరిజనులకు అప్పగించాలని సీఎం తెలిపారు. ఎన్టీఆర్ అమలు చేసిన చెట్టు-పట్టా విధానాన్ని పరిశీలించాలన్నారు. చెరువు గట్లు, కాలువల వెంట తాటి, ఈత మొక్కలు నాటాలని చెప్పారు.

వనమహోత్సవంలో భాగంగా ప్రజలకు ఉపమోగకరమైన మొక్కలే నాటాలని, వికారాబాద్ అడవుల్లో ఎకో టూరిజం అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. పోడు భూముల్లో పండ్లు తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలని, మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎస్ హెచ్ జీలో మహిళల సంఖ్య కోటికి చేరేలా స్పెషల్ డ్రైవ్ చేయాలని ఆదేశించారు. ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు ఇవ్వడమే లక్ష్యం అని, ఆర్టీసీలో అద్దె బస్సులు మహిళా సంఘాలకు ఇచ్చేలా చూడాలని చెప్పారు.