calender_icon.png 30 September, 2024 | 10:57 PM

కృత్రిమ మేధతో ఉద్యాన పంటల్లో మరిన్ని విజయాలు

30-09-2024 08:20:34 PM

కొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ బి.నీరజా ప్రభాకర్

గజ్వేల్,(విజయక్రాంతి): కృత్రిమ మేధ వినియోగంతో ఉద్యాన పంటల పెంపకం, కొత్త వంగడాల పరిశోధనలో మరిన్ని విజయాలను సాధించనున్నామని సిద్దిపేట జిల్లా ములుగులోని కొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం కొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ, అనురాగ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్సైన్సెస్ హైద్రాబాద్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ములుగులోనీ ఉద్యాన యూనివర్సిటీ అధికారిక కార్యాలయంలో సంబంధిత పత్రాలపై వైస్ ఛాన్సలర్ నీరజా ప్రభాకర్ ఎదుట యూనివర్సిటీ అధికారులతో పాటు అనురాగ్ యూనివర్సిటీ డాక్టర్ అర్చన మంత్రి, డీన్ డాక్టర్ నారాయణరెడ్డి, పరిశ్రమల శాఖ అధికారి డాక్టర్ ప్రతిభలు సంతకాలు చేసి ప్రతాలను ఒకరికొకరు అందజేసుకున్నారు.

ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ డాక్టర్ నీరజా ప్రభాకర్ మాట్లాడుతూ... రెండు యూనివర్సిటీల ఒప్పందంతో ఉద్యాన పంటల పెంపకం, కొత్త వంగడాల ప్రయోగాలలో కృత్రిమమేధను మరింత వినియోగించుకోవడంతో పాటు గొప్ప విజయాలను వేగంగా సాధించగలుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సెన్సార్ ఆధారిత సాంకేతిక ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ ప్రోగ్రాలపై పరిశోధనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎ.భగవాన్, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ లక్ష్మీ నారాయణ, హార్టికల్చర్ యూనివర్సిటీ డీన్ డాక్టర్ రాజశేఖర్, స్టూడెంట్ ఎఫైర్స్ డీన్ డాక్టర్ విజయ తదితరులు "పాల్గొన్నారు.