calender_icon.png 4 April, 2025 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లాభదాయక మామిడి పంటను సాగు చేయాలి

04-04-2025 12:20:25 AM

ఖమ్మం, ఏప్రిల్ -3 ( విజయక్రాంతి ):-పండ్లలలో లాభదాయక మామిడి పంటను అధికంగా రైతులు సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.గురువారం జిల్లా కలెక్టర్, కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామంలో బానోత్ లక్ష్మణ్ పండిస్తున్న కార్బోరైహిత మామిడి పంటలను పరిశీలించారు.

మామిడితోటలో లక్ష్మ ణ్, రైతులతో కలిసి కలెక్టర్ ముచ్చటించారు. గతంలో ఏ పంటలు సాగు చేశారు, ఎంత విస్తీర్ణంలో పంట వేశారు, అంతర్ పంటల సాగు ఎమైనా ఉందా, మామిడి పంట సంవత్సరానికి ఎంత దిగుబడి వస్తుంది, నీటి వనరులు ఎలా ఉన్నాయి వంటి వివిధ అంశాలను కలెక్టర్ అడిగి తెలుసు కున్నారు.

మామిడి సాగు విధానం పంట అధిక దిగుబడి కి తీసుకుంటున్న చర్యలు మార్కెటింగ్ విధానాన్ని రైతును అడిగి తెలుసు కున్నారు .మామిడి సాగుకు రైతులు ఆసక్తి చూపిందుకు చేపట్టాల్సిన చర్యలు వారికి ప్రభుత్వప రంగా అందించాల్సిన తోడ్పాటు వివరాలు అధికారులతో పాటు రైతును అడిగి తెలుసు కున్నారు. నేటి యువ రైతులు లాభదాయక పంటలపై ఆసక్తి చూపాలన్నారు.

ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట డిడబ్ల్యూఓ రాంగో పాల్ రెడ్డి, మండల ప్రత్యేకాధికారి మధుసూదన్, ఏడీఏ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ సుధాకర్, ఎంపీడీఓ రవీందర్, ఏఓ తారాదేవి, ఏఈ శ్రీనివాసులు, ఆర్డబ్ల్యూఎస్ జేఈ సతీశ్, ఉద్యాన అధికారి వేణు, శ్రావణి, ఆర్‌ఎ సక్రు, ఎంపీఓ ప్రభాకర్ రెడ్డి, ఏఈఓ ఉషా, జగదీశ్వర్, సూపర్వైజర్ వెంకటమ్మ, అంగన్వాడీ టీచర్లు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.