హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జూలై 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉన్నతాధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు కచ్చితమైన, సమగ్ర సమాధానాలు పంపించాలని, సమావేశాలప్పుడు సీనియర్ అధికారులు అసెంబ్లీలో ఉండాలని సీఎస్ ఆదేశించారు. జూలై 25వ తేదీన పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడుతున్నట్లు ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్ తెలిపారు.