calender_icon.png 17 October, 2024 | 6:57 PM

గ్రూప్-1 మెయిన్స్ నిర్వహణపై సీఎస్ సమీక్ష

17-10-2024 03:52:15 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): గ్రూప్-1 పరీక్షల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం  ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం సమీక్షించారు. ఈనెల 21 నుంచి 27 వరకు జరుగబోయే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని సీఎస్ అధికారులకు సూచించారు. గ్రూప్-1 మెయిన్స్ కు 34,383 మంది అభ్యర్థులు హాజరవుతారని సీఎస్ శాంతి కుమారి పేర్కొన్నారు.

ఈనెల 14న టీజీపీఎస్సీ హాల్ టికెట్లను విడుదల చేసింది. జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులతో సీఎం శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఇదిలా ఉండగా.. తెలంగాణలో గ్రూప్-1 పరీక్షల నిర్వహణ వివాదం ముదురుతోంది. గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలంటూ అభ్యర్థుల ఆందోళన చేయడంతో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అభ్యర్థులతో గురువారం గాంధీభవన్ లో భేటీ అయ్యారు.