హైదరాబాద్: ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు కార్యక్రమాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం సమీక్షించారు. ఈ సందర్బంగా శాంతి కుమారి మాట్లాడుతూ... డిసెంబర్ 7,8,9 తేదీల్లో ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలన్నారు. అదేవిదంగా ఈనెల 9న డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహవిష్కరణ, భారీ డ్రోన్ షో ఉంటుందని తెలిపారు. ఈనెల 7న వందేమాతరం శ్రీనివాస్ బృందం సంగీత ప్రదర్శన ఉంటుందని, 8న రాహుల్ సిప్లిగంజ్, 9న తమన్ మ్యూజికల్ ఈవెంట్లు ఉండనున్నట్లు సీఎస్ పేర్కొన్నారు. అలాగే పీవీమార్గ్ లో 120 ఆహారం, హస్తకళల స్టాళ్లు ఉంటాయని శాంతి కుమారి తెలిపారు.