హైదరాబాద్ : ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుపై తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధంగా ఉండేలా వారంలో డిజైన్ సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. పనుల పర్యవేక్షణకు ప్రభుత్వ సలహాదారుతో కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 49 గురుకులాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయన్న అధికారులు ఈ ఏడాది 8 స్కూళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందని శాంతి కుమారికి తెలిపారు.