calender_icon.png 25 September, 2024 | 3:57 AM

నిర్మల్‌లో మళ్లీ క్రిప్టో కలకలం

25-09-2024 01:10:48 AM

ఐదుగురు ప్రభుత్వ ఉపాధ్యాయుల అరెస్టు!

జిల్లా విద్యాశాఖలో అలజడి

నిర్మల్, సెప్టెంబర్ 24(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో క్రిప్టో బిట్ కాయిన్ అలజడి కలకలం సృష్టించింది. సెప్టెంబర్ 2న క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్‌తో సంబంధం ఉన్న ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసిన ఘటన మరువక ముందే మరో అయిదుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులను అదు పులో తీసుకున్నట్లు మంగళవారం తెలిసిం ది.

తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ని ర్మల్ జిల్లాలో క్రిప్టో బిట్‌కాయిన్ వ్యాపార గొలుసును పోలీసులు గుర్తించారు. రూ.50 కోట్ల వరకు వ్యాపారం జరిగినట్లు భావించి మొదట అయిదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఇందులో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఒకరు ఎక్సైజ్ ఎస్సై, మరొకరు ఏఆర్ పోలీసు కానిస్టేబుల్ ఉన్నారు.

క్రిప్టో లో పెట్టుబుడులు పెట్టిన ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు, ఏజెంట్లు, అధికారులు తమ పై చర్యలు ఉంటాయని భావించి భయం భ యంగా కాలం గడుపుతున్నారు. ఒక విద్యాశాఖలోనే 500 మంది  భాగస్వాములు అయినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు ప్రచారం జరిగింది.

పోలీసు, వ్యవసాయశాఖ, పంచాయతీ కార్యదర్శులు, రోడ్లు భవ నాల, నీటిపారుదలశాఖల అధికారులు సు మారు వెయ్యి మందికి పైగా ఉంటారని పో లీసులు అనుమానిస్తున్నారు. క్రిప్టోతో సంబ ంధమున్న ఉద్యోగ సంఘాల నేతలు ఎస్పీని కలిసి తమపై చర్యలు తీసుకోకుండా సహకరించాలని కోరినట్టు సమాచారం. 

ఉపాధ్యాయులపై కలెక్టర్ నజర్

ఈ వ్యవహారంలపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని విద్యాశాఖ అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చి ఉపాధ్యాయుల పనితీరుపై నిఘా పెట్టాలని ఆదేశించినట్టు తెలిసింది. దీ ంతో జిల్లా విద్యాశాఖలో క్రిప్టో పెట్టుబడుల పై చర్చ నడుస్తున్నది. కొందరు ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు తమ వారిని క్రిప్టో కేసు నుంచి కాపాడే ప్రయత్నాలు చేశా రు. కొందరు  జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క తో ఫోన్లు చేయించి జాబితాలో తమ పేర్లు లేకుండా ముందు జాగ్రత్త పడ్డట్టుగా జరుగుతోంది. 

పోలీసుల అదుపులో ఐదుగురు

జిల్లాలోని ముథోల్, నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో పనిచేస్తున్న ఐదుగురు ప్ర భుత్వ ఉపాధ్యాయులను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇందులో భైంసా రెవెన్యూ డివిజన్, ఖానాపూర్‌లో పనిచేస్తున్న ముగ్గు రితో పాటు మరో ఇద్దరిని అదుపులో తీసుకున్నట్టు సమాచారం.

ఇందులో నిర్మల్‌లో పనిచేసి బోథ్‌కు వెళ్లిన మరో ఉపాధ్యాయుడు సైతు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఖానాపూర్‌లో ఇద్దరిని, నిర్మల్‌లో ముగ్గురిని ఉదయం 4గంటలకే మఫ్టీలో వచ్చిన పోలీసులు వారి ఇళ్ల నుంచి తీసుకెళ్లి విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. నెల రోజుల్లోనే పది మంది ప్రభుత్వ ఉద్యోగులు క్రిప్టో వ్యవహారంలో పోలీసులకు చిక్కడం జిల్లాలో తీవ్ర చ ర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే  జిల్లా విద్యాధికారి రవీందరెడ్డి పనితీరుపై తీవ్ర వి మర్శలు వస్తున్నాయి. క్రిప్టోలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావడం వెనుక ఆయన హస్తం కూడా ఉండవచ్చని అయనను విధుల నుంచి తప్పించాలని విద్యార్థి సంఘాలు ఎస్పీ జానకి షర్మిల, కలెక్టర్ అభిలాష అభినవ్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 

పారిపోయిన పంతుళ్లు?

నిర్మల్ జిల్లాలో మంగళవారం ఉదయమే ఐదుగురు ఉపాధ్యాయులను అ దుపులో తీసుకున్నట్లు బయటికి పొక్కడ ంతో ఆ  దందాతో సంబంధమున్న మ రో ఇరవై మంది ఉపాధ్యాయులు జిల్లా ను విడిచి పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. పదిమంది ప్రభుత్వ ఉపాధ్యాయులతోపాటు ఉపాధ్యాయ సం ఘాల నాయకులు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. వీరి ఇండ్లకు  పోలీసులు ఉదయమే వెళ్లగా అప్పటికే వారు తప్పించుకుని పరారైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిం ది. వారి ఫోన్లు సైతం స్విచ్‌ఆఫ్ వస్తున్నట్టు సమాచారం.