calender_icon.png 11 March, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమతులు లేకుండానే క్రషింగ్

11-03-2025 12:00:00 AM

కరీంనగర్, మార్చి10 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో అనుమతులు లేకుండానే గ్రానైట్ వ్యారులు ఎండిఎల్ అనుమ తులు లేకుండానే  జోరుగా క్రషింగ్  చేస్తున్నారు. గనుల శాఖ నుంచి నామమాత్రపు అనుమతి తీసుకొని విచ్చలవిడిగా బోర్డర్ లేకుండా దందాను కొనసాగిస్తున్నారు. మైనింగ్‌ఆఫీసర్లు, విజిలెన్స్ అధికారులు అటూవైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో దాదాపు పది క్రషర్ యూనిట్ల వారు నిర్వహణలో కనీస నిబంధనలను పాటించడం లేదు.

అక్రమ క్రషింగ్ వెనుక ఒక అధికార పార్టీ నేత హస్తం ఉన్నట్టు తెలిసింది.  క్రషర్ నిర్వహణకు రాళ్ల తరలింపు ఎక్కడ నుంచి తీసుకవస్తారో సూచించకుండానే పక్కనే ఉన్న క్వారీ నుంచి డంపింగ్?రాళ్లను ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తూ తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. క్రషర్ నిర్వహణ మైనింగ్ శాఖ తమకు కేటాయించిన స్థలంలో క్రషర్, క్వారీ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ప్రాంతంలో మొక్కలు నాటి కాలుష్యాన్ని నియంత్రించాల్సిన ఉంటుంది. ఈ ప్రాంతం లో కాలుష్యాన్ని కొలిచే యంత్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దూమ్ముధూళి రాకుండా ఎప్పుడు నీటిని వెదజల్లేలా, దుమ్మ గాలిలోకి లేవకుండా క్రషర్ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఖనిజాలు, సహజ వనరులను నిబంధనల ప్రకారం లీజుకు అనుమతులు లేకుండా నిర్వహించడమే కాకుండా ప్రకృతి అందించిన వనరులను కొల్లగొడుతూ రూ.కోట్ల రూపాయల సంపదను దోచుకుంటున్నారు.

దీనికి తోడు వే బిల్లుల బాగోతం కూడా గుట్టుచప్పుడు కాకుండా నడుస్తుంది. గజనుల శాఖకు పూర్తి స్థాయి అధికారి లేకపోవడం తో ఇటీవల కాలంలో అక్రమ క్రషింగ్ పెరిగింది. సంబంధిత అధికారిని వివరణ కోరేందుకు విజయక్రాంతి ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు.