calender_icon.png 10 January, 2025 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రషర్ అనుమతులు రద్దుచేయాలి

03-12-2024 03:21:13 AM

తహసీల్దార్ కార్యాలయం ఎదుట నల్తూరు గ్రామస్థుల ధర్నా

పటాన్‌చెరు, డిసెంబర్ 2: నల్తూరు గ్రామ పరిధిలో ఏర్పాటవుతున్న కంకర క్రషర్ పనులను నిలిపేయడంతో పాటు అనుమతులను రద్దు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం గ్రామస్తులు జిన్నారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

కంకర క్రషర్ ఏర్పాటుతో పచ్చని గ్రామాన్ని పాడుచేయవద్దని అధికారులను కోరారు. అనంతరం తహసీల్దార్ ఎం.భిక్షపతికి, జిన్నారం సీఐ నయీమొద్దీన్‌కు వినతిపత్రాలు అందజేశారు. మాజీ సర్పంచ్ జనార్దన్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్, గ్రామస్థులు పాల్గొన్నారు.