calender_icon.png 6 November, 2024 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్ను దొంగిలించాడని చితకబాదారు

06-08-2024 01:40:51 AM

  1. ఆశ్రమ పాఠశాలలో 3వ తరగతి విద్యార్థిపై పైశాచికం
  2. బ్యాట్‌తో ముఖం, వీపుపై దాడి
  3. 3 రోజులు గదిలో పెట్టి హింసించిన ఇన్‌చార్జి, సిబ్బంది 
  4. నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు

కర్ణాటక (రాయచూర్), ఆగస్టు 5: కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌లోని రామకృష్ణ ఆశ్రమంలో పెన్ను దొంగలించాడని ఓ 3వ తరగతి విద్యార్థిని ఇన్‌చార్జి, సిబ్బంది దారుణంగా హింసించారు. కట్టెలతో కొట్టి బ్యాట్ తో ముఖం, వీపుపై విచక్షణారహితంగా చితకబాదారు. అంతటితో ఆగకుండా ఓ గదిలో 3 రోజుల పాటు బంధించి చిత్రహింసలకు గురిచేశారు. వివరాల్లోకి వెళితే.. ఆశ్రమంలో మూడో తరగతి చదువుతున్న తరుణ్‌కుమార్‌పై తోటి విద్యార్థులు తమ పెన్ను దొం గతనం చేశాడని ఫిర్యాదు చేశారు.

దీంతో కోపోద్రిక్తుడై ఆశ్రమ ఇన్‌చార్జి, అతని సహాయకులు ఈ దాష్టీకానికి ఒడిగట్టారు. ఈ క్రమంలో తరుణ్‌ను చూసేందుకు అతడి తల్లి ఆశ్రమానికి రాగా దాడి గురించి ఆమెకు తెలిసింది. వెంటనే తరుణ్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కాగా దాడిలో తరుణ్‌కు తీవ్ర గాయాలు కాగా, అతని కళ్లు పూర్తిగా వాచిపోయాయి. చేతులు, వీపు భా గంపై వాతలు తేలాయి. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

ఇన్‌చార్జిపై చర్యలు తీసుకోవాలి..

ఆర్థికంగా పరిస్థితులు బాగాలేని కారణంగా తన ఇద్దరు పిల్లలను రామకృష్ణ ఆశ్ర మంలో చేర్పించి చదివిస్తున్నానని తరుణ్ తల్లి తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. పెద్ద కొ డుకు అరుణ్‌కుమార్ 5వ తరగతి, చిన్న కొ డుకు తరుణ్ 3వ తరగతి చదువుతున్నాడు. తరుణ్ తరగతి గదిలో ఓ పెన్ను కిందపడి ఉండటాన్ని గమనించి దానిని వేరేచోట పెట్టాడు. ఇది తెలియని తోటి విద్యార్థులు అతడే తమ పెన్ను కొట్టేశాడని ఆరోపిస్తూ ఆశ్రమ ఇన్‌చార్జికి ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో వారి మాటలు నమ్మి ఇన్‌చార్జి, అతడి సహాయకులు తరుణ్‌కుమార్ ను చిత్రహింసలకు గురిచేశారని నా పెద్దకొడుకు అరుణ్‌కుమార్ నాతో చెప్పాడు. నా కొడుకు మీద ఆరోపణలు అవాస్తవం. అకారణంగా నా కొడుకుపై దాడిచేసిన ఇన్‌చార్జికి సేమ్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలి. అతడిని కూడా మూ డు రోజుల పాటు గదిలో బంధించి హింసించాలి. అప్పుడే అతడికి నా కొడుకు పడిన బాధ తెలుస్తుంది అని కన్నీటి పర్యంతమైంది తరుణ్ తల్లి.

కాగా ఈ విషయమై బాలల హక్కుల కార్యకర్త సుదర్శన్ మాట్లాడుతూ.. బాలుడిని రక్షించామని, మహిళా శిశు సం క్షేమ శాఖ అధికారులకు విషయాన్ని తెలియజేశామన్నారు. పోలీసులు నిందితులపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.