హిందూ సంఘాల పిటిషన్ల విచారణకు అనుమతి
షాహీ ఈద్గా పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు
సుప్రీం కోర్టుకు వెళ్తాం: ఈద్గా కమిటీ
అలహాబాద్, ఆగస్టు 1: ఉత్తరప్రదేశ్‌లోని వివాదాస్పద మథుర మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ప్రకటించింది. శ్రీ కృష్ణ జన్మభూమిగా భావిస్తున్న స్థలంలో ఉన్న షాహీ ఈద్గాను తొలగించాలని హిందూ ధార్మిక సంఘాలతోపాటు శ్రీకృష్ణుడి తరఫున దాఖలైన ౧౮ పిటిషన్లు విచారణకు అర్హమైనవేనని గురువారం కోర్టు తీర్పు చెప్పింది. ఆ పిటిషన్లను తిరస్కరించాలని షాహీ ఈద్గా కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ కొట్టివేశారు. ఈ కేసులో గతంలోనే వాదనలు పూర్తికాగా తీర్పును జూన్ ౬న రిజర్వ్ చేశారు. తాజాగా గురువారం తీర్పు ప్రకటించారు. మొత్తం 18 దావాలు విచారణ కు అర్హమైనవేనని న్యాయమూర్తి ప్రకటించారు.
మసీదు ఇల్లీగల్
మథురలో ౧౩.౩౭ ఎకరాల్లో షాహీ ఈద్గా మసీదుతోపాటు కేత్ర కేశవ్ దేవ్ ఆలయం పక్కపక్కనే ఉంటాయి. అయితే, ప్రస్తుతం మసీదు ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు శ్రీకృష్ణుడి ఆల యం ఉండేదని, అదే కృష్ణ భగవానుడి జన్మస్థలమని హిందువులు వాదిస్తున్నారు. మసీదు ను అక్కడి నుంచి తొలగించి ఆ భూమిని తమ కు అప్పగించాలని కోరుతూ పిటిషన్లు వేశారు. ‘మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలం నుంచి మథురలో ఆలయం ఉంది. ఆ తర్వాత కొంద రు ఆలయాన్ని పడగొట్టి ఈద్గా నిర్మించారు. ఈద్గాకు సంబంధించిన ఎలాంటి రికార్డులు అవతలి పార్టీ వద్ద లేవు’ అని హిందూ సంఘా ల తరఫు న్యాయవాదులు వాదించారు. మసీ దు నిర్మాణానికి అనుమతులు కూడా లేవని, అందువల్ల అది చట్ట వ్యతిరేక నిర్మాణమని పేర్కొన్నారు.
అది వక్ఫ్ భూమి: షా ఈద్గా కమిటీ
హిందూ సంఘాల వాదనను షాహీ ఈద్గా కమిటీ తరఫు న్యాయవాది తస్లిమా అజీజ్ అహ్మద్ వ్యతిరేకించారు. మసీదు స్థలం వక్ఫ్ భూమి అని, అందువల్ల ఈ భూమిపై ఎలాంటి వివాదాన్నైనా విచారించే అధికారం వక్ఫ్ ట్రిబ్యునల్ మాత్రమే ఉంటుందని వాదించారు. ఈ వాదనను హిందూ సంఘాల న్యా యవాదులు తోసిపుచ్చారు. అసలు మసీదు పేరున ఎలాంటి భూమి లేదని తెలిపారు. ఒకవేళ ఆ భూమి వక్ఫ్ బోర్డుదే అయితే, దానిని ఎవరు దానం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వాదనల అనంతరం షాహీ ఈద్గా కమిటీ వాదనను న్యాయమూర్తి తిరస్కరించారు. ప్రార్థనా స్థలాల చట్టెేం౧౯౯౧, లిమిటే షన్ చట్టం స్పెసిఫిక్ రిలీఫ్ చట్టం ప్రకారం హిందూ సంఘాల పిటిషన్లు విచారణకు అర్హమైనవేనని ప్రకటించారు. తదుపరి విచారణను ఈ నెల ౧౨వ తేదీకి వాయిదా వేశారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని కమిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ ట్రస్ట్ షాహీ మస్జిద్ ఈద్గా న్యాయవాదులు ప్రకటించారు.