బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం మావోయిస్టులు అమర్చిన ప్రెజర్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (Improvised explosive device) పేలడంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) జవాన్ గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పెట్రోలింగ్ సమయంలో మహదేవ్ ఘాట్ ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. అక్కడ సీఆర్పీఎఫ్(Central Reserve Police Force) 196వ బెటాలియన్ బృందం ఉదయం ఏరియా డామినేషన్ ఆపరేషన్‌కు బయలుదేరిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గాయపడిన జవాన్‌ను బీజాపూర్(bijapur district) జిల్లా ఆసుపత్రిలో చేర్చినట్లు అధికారి తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున, పొరుగున ఉన్న నారాయణపూర్ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ఐఇడిలు రెండు చోట్ల పేలడంతో ఒక గ్రామస్థుడు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. జనవరి 6న బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు వాహనాన్ని ఐఈడీతో పేల్చివేసి ఎనిమిది మంది పోలీసు సిబ్బందితో పాటు ఓ పౌరుడు డ్రైవర్‌ను హతమార్చారు.