27-03-2025 11:17:52 PM
ముఖ్యఅతిథిగా చత్తీస్గడ్ సెక్టర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ రాకేష్ అగర్వాల్..
అలరించిన సాంస్కృతి కార్యక్రమాలు..
చర్ల (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో గల సీఆర్పీఎఫ్(CRPF) 151 బెటాలియన్ 23 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం వార్షికోత్సవం నిర్వహించారు. బెటాలియన్ పరిసర ప్రాంతంలో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జెడ్ పి హెచ్ ఎస్ తెగడ స్కూల్ విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. భద్రాచలం సెయింట్ పాల్ విద్యాలయం విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో చత్తీస్గడ్ సెక్టర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ రాకేష్ అగర్వాల్ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ తో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి చతిస్గడ్ సెక్టర్ డిఐజి ఎన్ కేసింగ్, డిఐ జి ఓప్స్ కుంట సూరజ్ పాల్ వర్మ, కమాండెంట్ 151 రాజీవ్ కుమార్ 204 81, 218 బెటాలియన్ కమాండెంట్స్ లు హాజరయ్యారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ అధికారులు కలివేరు గ్రామ ప్రజలు స్కూల్ సిబ్బంది, విద్యార్థులు, జవాన్లు తదితరులు పాల్గొన్నారు.