calender_icon.png 2 February, 2025 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకే పట్టం కట్టండి..

02-02-2025 06:38:48 PM

ఎన్నికల ఇంచార్జ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి అంజి రెడ్డికి విద్యావంతులు పట్టం కట్టాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ పాయల్ శంకర్ కోరారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉన్న పట్టబద్రుల అభ్యర్థి అంజిరెడ్డిని గెలిపిస్తే ప్రశ్నించే గొంతుకగా ప్రజల ముందు ఉంటారని అన్నారు. బీజేపీ సైతాంతిక భావజాలం ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్యలకు తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.