calender_icon.png 14 February, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిరుమళ్ల జాతరకు భక్తజన సందోహం

14-02-2025 12:00:00 AM

సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యే పాయం

మణుగూరు, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమళ్ల గ్రామంలో చందా వంశస్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మక్క సారలమ్మ వనదేవతల జాతరలో తెలంగాణ రాష్ర్ట పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గద్దెలను దర్శించుకున్నారు, వనదేవతలను గద్దెలకు తోడుకొని వచ్చేటప్పుడు ఆదివాసి గిరిజన సాంప్రదాయ సంస్కృతికి అనుగుణంగా డోలు వాయిద్యాలు గిరిజన నృత్యాలతో అమ్మవారిని గద్దెకు తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా ఆదివాసి గిరిజనులతో కలిసి మంత్రి సీతక్క గిరిజన సంప్రదాయ నృత్యం చేశారు. జాతర నిర్వహణకు కృషి చేసిన చందా వంశస్తులకు మంత్రి, సీతక్క ఎమ్మెల్యే పాయం లు ధన్యవాదాలు తెలిపారు.

గుడి అభివృద్ధికి రహదారి, ప్రహరీ గోడ నిర్మాణం చేపడతామని ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యేలు ఆలయ కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే, జడ్పీ మాజి ఛైర్మన్ చందా లింగయ్య, చందా సంతోష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇక్బాల్ హుస్సేన్, మహిళా, యువజన నాయకులు పోలబోయిన శ్రీవాణి, ఆలయ కమిటీ సభ్యులు వేడుకల్లో పాల్గొన్నారు.