calender_icon.png 21 February, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చాయ్​, బిస్కెట్​ కోసం ఎగబడ్డ జనం

19-02-2025 10:28:19 AM

ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం

జనగామ,(విజయక్రాంతి): ఓ కంపెనీ తమ ప్రచారం కోసం ఉచితంగా చాయ్​, బిస్కెట్​  పంపిణీ చేయడంతో జనాలు ఎగబడ్డారు. కేవలం రూ.10 విలువ చేసే టీ కోసం వందలాది మంది గంటల తరబడి ప్రజలు క్యూలో నిల్చోవడం గమనార్హం. ప్రముఖ నీలోఫర్​ టీ పౌడర్​ కంపెనీ జనగామలో ఓ వ్యక్తికి డిస్ట్రిబ్యూషన్​ అప్పగించింది. అయితే సదరు కంపెనీ చాయిపత్తాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఆ కంపెనీ వినూత్న ప్రచారానికి దిగింది. జనగామలోని నెహ్రూ పార్క్​ వద్ద రైల్వే స్టేషన్​కు  వెళ్లే రోడ్డులో ప్రధాన టెంటు వేసి అక్కడే తమ చాయిపత్తాతో చాయ్​ తయారుచేసి ప్రజలకు ఉచితంగా అందజేశారు. చాయ్​తో పాటు బిస్కెట్​ కూడా అందజేశారు. నిత్యం జనాల తాకిడి ఉండే ప్రాంతం కావడంతో ఉచితంగా టీ,  బిస్కెట్​ తీసుకునేందుకు ప్రజలు బారులు తీరడంతో ఆ రోడ్డుపై ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్​ ఏర్పడి రాకపోకలు బంద్​ అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.