calender_icon.png 15 January, 2025 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రౌడ్ ఫండింగ్ ఫర్ వయనాడ్

09-08-2024 12:39:00 AM

తమిళనాడులోని హోటల్ వ్యాపారి వినూత్న ఆలోచన

దిండిగల్ (తమిళనాడు), ఆగస్టు 8: వయనాడ్ బాధితుల కోసం తమిళనాడులోని దిండిగల్‌కు చెందిన ఓ హోటల్ వ్యాపారి ముజీబ్ వినూత్నంగా ఆలోచించాడు. తన హోటల్‌లో ఓ విందును ఏర్పాటు చేస్తున్నానని.. విందులో పాల్గొన్నవారు వయనాడ్ బాధితుల కోసం విరాళాలు అందించాల్సిందిగా కస్టమర్లను కోరుతూ ఓ పోస్టు పెట్టాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం తన హోటల్‌లో సేవలను నిలిపివేసి.. హాల్‌లో వరుసగా టేబుల్‌లు వేసి విందు ఏర్పాట్లు చేశాడు. ఈ విందుకు అతడు అనుకున్న దానికన్నా అనూహ్య స్పందన వచ్చింది. విందు ద్వారా వచ్చిన నగదును వయనాడ్‌లోని బాధితుల కోసం ఖర్చుపెట్టనున్నట్లు ముజీబ్ తెలిపాడు.