calender_icon.png 16 January, 2025 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదాద్రిలో భక్తుల రద్దీ

01-07-2024 01:27:32 AM

 స్వామివారి దర్శనానికి రెండు గంటల సమయం

యాదాద్రి భువనగిరి, జూన్ 30 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని భక్తులు ఆదివారం పెద్ద సంఖ్యలో సందర్శించారు. స్వామివారి ధర్మ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది. దాదాపు 40 వేల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించినట్టుగా అధికారుల అంచనా. ప్రధానాలయంలో స్వామివారికి నిత్య సంప్రదాయ పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ మండపంలో హోమం జరిపారు. లక్ష్మీనరసింహుల నిత్య కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు.

స్వామివారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి.. 

లక్ష్మీనరసింహ స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రియదర్శిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. కుటుంబ సభ్యులతో వచ్చిన ఆమెకు అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. స్వామివారి శేష వస్త్రాలను అందజేసి వేదాశీర్వచనం జరిపారు. ఆలయ ఈవో ఏ భాస్కర్‌రావు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అదే విధంగా వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి సైతం స్వామివారిని దర్శించుకున్నారు.