calender_icon.png 26 December, 2024 | 1:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదాద్రిలో భక్తుల రద్దీ

26-12-2024 02:07:16 AM

నల్లగొండ, డిసెంబర్ 25 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం భక్తులు పోటెత్తారు. వరుసగా రెండ్రోజులు సెలవులు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాల్లో జన సందోహం కనిపించింది. క్యూలైన్లలో భక్తు లు భారీగా బారులుదీరారు. ఉచిత ప్రవేశ దర్శనానికి సుమారు 3 గంటలు,  ప్రత్యేక దర్శనానికి గం టన్నర సమయం పట్టింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశాంక్ గోయల్, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, గిరిజన సంక్షేమశాఖ కా ర్యదర్శి శరత్, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, దే వాదాయ అదనపు కమిషనర్ జ్యోతి తదితర ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు.