calender_icon.png 3 November, 2024 | 1:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదాద్రిలో భక్తుల రద్దీ

13-05-2024 12:13:18 AM

స్వామివారి దర్శనానికి బారులు 

యాదాద్రి భువనగిరి, మే 12 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లనృసింహ స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. విద్యార్థులకు వేసవి సెలవులతో పాటు కార్యాలయా లు, వివిధ సంస్థలకు మూడు రోజులు వరుసగా సెలవులు రావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. తలనీలాల సమర్పణ, వ్రత పూజలతో పాటు ఆలయంలో ప్రత్యే క ఆర్జిత పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

అర్చకులు స్వామివారికి అష్టోత్తర, సువర్ణ పుష్పార్చనలు గావించారు. ఆలయ ఉత్సవ మండపం లో స్వామివారికి సుదర్శన నారసింహ హోమ పూజలు చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా లక్ష్మీనృసింహుల నిత్య కల్యా ణ క్రతువు జరిపించారు. సాయంత్రం ఆలయ వీధుల్లో భక్తుల గోవిందనామస్మరణలతో అలంకార ఉత్సవమూర్తులను ఊరేగించి వేడిజోడి సేవ నిర్వహించారు.

యాదాద్రి నృసింహుడి ఆదాయం రూ.57.76 లక్షలు

భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆదివారం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారికి భారీగా ఆదాయం సమకూరింది. వివిధ కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.57,76,291 ఆదాయం సమకూరినట్టు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్ భాస్కర్‌రావు తెలిపారు.