calender_icon.png 14 October, 2024 | 6:55 AM

యాదాద్రిలో భక్తుల సందడి

14-10-2024 02:15:16 AM

యాదాద్రి భువనగిరి, అక్టోబరు 13 (విజయక్రాంతి) : దసరా సెలవుల కారణంగా ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. దీంతో కొండపై భక్తుల రద్దీ నెలకొంది. ధర్మద్రర్శనానికి దాదాపు 3గంటల సమయం పట్టింది.

భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపి మొక్కులు చెల్లించుకున్నారు. ఏకాదశి సందర్భంగా ఉత్సవ మూర్తులకు అర్చకులు లక్ష పుష్పార్చనలు జరిపారు. స్వామివారిని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి దర్శించుకున్నారు.పూజల అనంతరం వీరికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం జరిపి తీర్ధప్రసాదాలను అందజేశారు.

కాగా నృసింహుడికి ఆదివారం హైదరాబాద్‌కు చెందిన భక్తులు మల్లెల నర్సింగరావు, రేణుక దంపతులు అయిదు వెండి కలశాలను కానుకలుగా అందజేశారు. స్వామివారి ఆలయ విమాన గోపుర స్వర్ణ తాపడానికి ఎం. నవీన్‌కుమార్ అనే భక్తుడు రూ.77,985 విరాళంగా అందజేశారు.