calender_icon.png 30 October, 2024 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీ

08-07-2024 01:07:40 AM

స్వామివారికి రూ.49 లక్షల ఆదాయం

యాదాద్రి భువనగిరి, జూలై7(విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఆషాఢ మాసం తొలి ఆదివారం సైతం భక్తుల రద్దీ కొనసాగింది. స్వామివారి దర్శనం కోసం పెద్దసంఖ్యలో భక్తులు భారులు తీరారు. ఉదయం పూట ధర్మ దర్శనానికి దాదాపు 3 గంటల సమయం పట్టినట్టు భక్తులు తెలిపారు. సాయంత్రం లక్ష్మీనృసింహుల అలంకార మూర్తులను ఆలయ తిరువీధుల్లో వెండి జోడి సేవ నిర్వహించారు. స్వామివారికి ఆదివారం వివిధ కైంకర్యాల ద్వారా రూ.49,02,345 ఆదా యం సమకూరినట్టు కార్యనిర్వహణాధికారి ఏ భాస్కర్‌రావు తెలిపారు. కాగా, దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంస్కృత విద్యాపీఠాన్ని ఆలయ ఈవో ఏ భాస్కర్‌రావు అకస్మికంగా తనిఖీ చేశారు. ప్రవేశ నుంచి డిగ్రీ వరకు సంస్కృత భాషలో గురుకుల విధానంలో నిర్వహిం చే ఈ విద్యాపీఠంలో విద్యార్థుల వసతి, భోజనం తదితర సదుపాయాలను అడిగితెలుసుకున్నారు.