హైదరాబాద్: వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రెండో కార్తిక సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం 2 సార్లు సత్యనారాయణ స్వామి వత్రాలు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో ఆర్జిత, అన్న పూజలు సేవలు రద్దు చేశారు.