జుక్కల్ ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే వివిధ ప్రాం తాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మొక్కులు చెల్లించుకుని, ఆలయ పూజారి నుండి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.
అనంతరం భక్తులు సామూహికంగా భోజనాలు చేశారు. మహారాష్ట్ర నుండి కూడా భక్తులు తరలి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ పూజా కార్యక్రమం భక్తులంతా పెద్ద ఉత్సాహంతో పాల్గొన్నారు, పర్వదినంలా ఆలయ ప్రాంగణం కళకళలాడింది.