calender_icon.png 22 December, 2024 | 11:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్న ఆలయంలో రద్దీ

16-09-2024 03:51:30 AM

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిధిలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో ఆదివారం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. సామి వారికి మహాన్యాస పూరక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. పరివార దేవతార్చనలు చేపట్టారు. వినాయక విగ్రహం వద్ద పూర్ణాహుతి గావించారు. సాయంత్రం పురవీధుల్లో ఊరేగింపు చేపట్టారు. అనంతరం ఆలయ ధర్మగుండం లో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. వరుసగా సెలవులు రావడంతో ఆలయం భక్తుల రాకతో కిటకిటలాడింది.