మగాళ్లను లక్ష్యం చేసుకుని దాడి చేస్తున్న కాకులు...
సిరిసిల్లలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అక్కడ కట్ట మైసమ్మ గుడి వద్ద చెట్టుపై ఉన్న కాకులు ఆ దారిలో తిరిగే పురుషులపై దాడి చేస్తున్నాయి. అయితే ఆడవాళ్ల జోలికి వెళ్లడం లేదు. దీంతో ఇదెక్కడి 'కాకి గోలరా' బాబు అని ప్రజలు తలపట్టుకుంటున్నారు. ఈ తంతును కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. దీంతో అవి ఆడ కాకులని, మగాళ్లపై పగబట్టాయని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.