ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి మూ సీ ప్రక్షాళన పేరు తో అడ్డగోలు భాష మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, విద్యార్థి నేత స్వామియాదవ్‌తో కలిసి మాట్లాడుతూ మూసీ నది అభివృద్ధి పేరు తో నిర్వాసితులకు నష్టం జరగొద్దని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోందన్నారు.
నల్లగండ జిల్లా రైతులను సీఎం రేవంత్ రెడ్డి రెచ్చగొడుతున్నారని, బీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్ నగరం లో 32 ఎస్టీపీలను నిర్మించినట్లు తెలిపారు. మూసీ అభివృద్ధి చైర్మన్‌గా తనను నియమించి కేసీఆర్ అభివృద్ధికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.