11-03-2025 01:04:00 AM
పట్నా, మార్చి 10: బిహార్‌లో దోపి డీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఆరాలోని తనిష్క్ షోరూంను సిబ్బంది ఎప్పటిలాగే సోమవారం ఉదయం 10 గంటలకు తెరిచారు. కాసేపటికే కొంతమంది దుండగులు ముఖాలకు హెల్మె ట్, మంకీ క్యాప్‌లు ధరించి తుపాకులతో లోనికి ప్రవేశించారు.
సెక్యూరిటీ వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. వారివద్ద ఉన్న ఆయుధాలతో సిబ్బందిని బెదిరించి షోరూంలోని రూ.౨౫ కోట్ల నగలను అపహరించారు. అడ్డువచ్చిన ఒక సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. సమాచారం అం దుకున్న పోలీసులు ఘటనా స్థలికి చే రుకోగా అప్పటికే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే నిందితులను వెంబడించిన పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్ద రు నిందితులకు గాయాలయ్యాయి.