calender_icon.png 30 October, 2024 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసు విత్‌డ్రా చేసుకుంటే 5 కోట్లు ఇస్తానన్నారు

15-07-2024 02:10:12 AM

రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య సంచలన వ్యాఖ్యలు

నార్సింగి పోలీసులకు మరిన్ని ఆధారాలు అందించినట్టు వెల్లడి

రాజేంద్రనగర్, జూలై 14 : రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రాపై పెట్టిన కేసును విత్‌డ్రా చేసుకుంటే తనకు రూ.5 కోట్లు ఇస్తానని ఆఫర్ చేశారని రాజ్‌తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం ఆమె నార్సింగి పోలీసులను కలిసి కేసుకు సంబంధించిన మరిన్ని ఆధారాలు సమర్పించారు. తనను మాల్వీ మల్హోత్రాతో పాటు ఆమె సోదరుడు వేధించిన వివరాలను పోలీసులకు అందజేసినట్లు పేర్కొన్నా రు.

దీంతో పాటు రాజ్‌తరుణ్‌తో జరిగిన వివాహానికి సంబంధించిన ఫొటోలను కూడా ఇచ్చానన్నారు. రాజ్‌తరుణ్ తనకు కావాలని, అతడు తన నుంచి తప్పిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన స్టేట్ మెంట్ రికార్డు చేసిన నార్సింగి పోలీసులు సోమవారం విచారణకు రావాలని సూచించారన్నారు. తన మెడికల్ బిల్లులను రాజ్ తరుణే చెల్లించాడని, వాటికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులకు సమర్పించానని తెలిపారు. తాను ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం దర్యాప్తు కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.