calender_icon.png 14 October, 2024 | 8:08 AM

288కోట్లు దోచేశారు

14-10-2024 02:55:47 AM

జగిత్యాల కేంద్రంగా భారీ జీఎస్టీ ఐటీసీ కుంభకోణం

  1. బోగస్ కంపెనీలతో దోచేసిన జీఎస్టీ కన్సల్టెంట్ 
  2. వ్యాపారం చేయకుండానే చేసినట్లు ఇన్‌వాయిస్‌లు 
  3. 350 మంది డీలర్ల ఖాతాల్లో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ సొమ్ము 
  4. దోపిడీకి సహకారం అందించిన జీఎస్టీ అధికారులు? 
  5. ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం.. చర్యలు మొదలు 
  6. ఐదు రాష్ట్రాల్లో డీలర్ల ఖాతాలు ఫ్రీజ్.. 11 కోట్లు రికవరీ 

జగిత్యాల, అక్టోబర్ 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో మరో భారీ జీఎస్టీ కుంభకోణం వెలుగుచూసింది. జగిత్యా ల జిల్లా కేంద్రగా బోగస్ కంపెనీలు, నకిలీ ఇన్‌వాయిస్‌లతో ఓ జీఎస్టీ కన్సల్టెంట్ రూ.288 కోట్లు కాజేసినట్లు తేలింది. ఈ సొమ్మును ఐదు రాష్ట్రాల్లోని ౩౫౦ మంది డీల ర్ల ఖాతాల్లో వేశారు.

ఆడిట్‌లో ఈ అక్రమాలను గుర్తించి అప్రమత్తమైన జీఎస్టీ అధికారులు ఐదు రాష్ట్రాల్లోని డీలర్ల ఖాతాలను స్తంభింపజేసి ప్రభుత సొమ్మును కొంత మేర కాపాడగలిగినట్లు తెలిసింది. కంపెనీలు ప్రారంభించి వ్యాపారం చేయకుండానే చేసినట్లు కాగితాలపై చూపించి భారీ మొత్తంలో ఐటీసీలను నొక్కేశారని సమాచారం.

గత బీఆర్‌ఎస్ ప్రభుత హయాంలో ఏడాదిన్నర పాటు ఓ ట్యాక్స్ కన్సల్టెంట్ చేసిన ఈ మోసాన్ని జీఎస్టీ అధికారులు ఆలస్యంగా గుర్తించారు. జీఎస్టీ ప్రాక్టిషనర్‌ను అరెస్టు చేసి దాదాపు రూ.11 కోట్ల వరకు వివిధ కంపెనీల నుంచి రికవరీ చేసినట్లు తెలుస్తోంది. 

32 బోగస్ సంస్థలతో 

జగిత్యాలలో చందా సాయికుమార్ జీఎస్టీ ప్రాక్టిషనర్‌గా పనిచేస్తున్నాడు ఎవరైనా కొత్తగా వ్యాపారం చేయాల నుకునేవారు సంస్థలు ఏర్పాటు చేయాలంటే ఇతడిని కలిసేవారు. వివిధ కారణాలతో కంపెనీలను మూసివేయా లన్నా ఇతని వద్దకే వెళ్లి అందుకు కావాల్సిన ప్రక్రియను పూర్తి చేసుకునేవారు. వ్యాపార సంస్థలను మూసివేయాలని తమ వద్దకు వచ్చినవారి నుంచి పాన్, ఆధార్ కార్డు లను సాయికుమార్ సేకరించేవాడు.

జీఎస్టీ చట్టంలోని లొసుగులను ఉపయోగించుకొని కంపెనీలను మూసివేటానికి ఇచ్చిన పాన్ నంబర్లు, ఆధార్ కార్డుల ఉపయో గించి ఫోన్ నంబర్లు మార్చి వాటిని మూసివేయకుండా యధావిధిగా కొనసాగించే వాడని సమాచారం. క్షేత్రస్థాయిలో వ్యాపార లావాదేవీలు నిరహించకుండానే పేపర్ పైనే లావాదేవీలు నిరహించినట్లు చూపించి తప్పుడు పత్రాలు జీఎస్టీ వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేశాడు.

మొత్తం 32 బోగస్ సంస్థలను తెరచి వాటి దారా అత్యధిక జీఎస్టీ స్లాబ్ ఉన్న సిమెంట్, ఉక్కు వ్యాపారం చేసినట్లు కాగితాల్లో చూపించి ఆదాయానికి అనువైన మార్గంగా మలుచుకొన్నాడని అధికారులు గుర్తించారు. తన బోగస్ సంస్థల ఖాతాల్లో జమ అయిన ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ మొత్తాన్ని తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ర్ట, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాల్లో 350 మంది వ్యాపారులకు బదిలీ చేసినట్లు గుర్తించారు. తెలంగాణలో 302 మంది వ్యాపారస్థులు ఉండగా, మరో 48 మంది వ్యాపారులు మిగతా ఐదు రాష్ట్రాల్లో ఉన్నట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు.

అధికారుల నిర్లక్ష్యం వల్లనే..

జీఎస్టీ అధికారుల నిర్లక్ష్యంతోనే జగిత్యాల కేంద్రంగా ట్యాక్స్ కన్సల్టెంట్ దారా రూ.288 కోట్ల ఐటీసీ కుంభకోణం జరిగిందనే విమర్శలు వస్తున్నాయి.  ఈ భారీ కుంభకోణం బయట పడకుండా అధికారులను బురిడీ కొట్టించేందుకు సాయికుమార్ ఐటీసీ 02 ఫామ్ ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఆయా డివిజన్ల పరిధిలోని జీఎస్టీ అధికారుల నిర్లక్ష్యం తోడవడంతో అతడు ఆడిందే ఆటగా చెలరేగిపోయిన ట్లు చెప్తున్నారు.

రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుతం అధికారంలోకి వచ్చిన తరాత గత ఏడాది డిసెంబర్ మూడో వారం లో సాయికుమార్‌ను అరెస్టు చేసినట్లు అధికారవర్గాల సమాచారం. 32 బోగస్ కంపెనీల పేరుతో రూ.288 కోట్ల ఐటీసీ నిధులు దాదాపు 350 ట్యాక్స్ పేయర్లకు బదిలీ అయినట్లు గుర్తించారు.

ఇందులో అత్యధికంగా రూ.120 కోట్లు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కేంద్రంగా ఏర్పాటు చేసిన బోగస్ కంపెనీకి పంపించినట్లు తేలింది. మిగిలిన మొత్తాన్ని హైదరాబాద్‌లోని పంజాగుట్ట, చార్మినార్, సరూర్‌నగర్ పరిధిలోని వివిధ వ్యాపార సంస్థలకు, మరికొంత మొత్తం ఏపీ, కర్ణాటక, ఒడిశా, గుజరాత్, మహారాష్ర్టకు బదలాయించినట్లు తేలింది. 

17 మంది డీలర్ల బ్యాంకులు ఖాతాలు సీజ్

విచారణ చేపట్టిన అధికారులు దాదాపు 150 సంస్థల ఖాతాల్లోని ఐటీసీని స్తంభింపచేయడంతోపాటు మరో 17 మంది డీలర్లకు చెందిన బ్యాంకు ఖాతాలనూ స్తంభింపచేశారు. ఆయా సంస్థలు ఉపయోగించిన ఐడీలు తమకు ఇవాలని జగిత్యాల సహాయ కమిషనర్ ఆనందరావు డీజీపీకి గత నెలలో లేఖ రాసినట్లు చెప్తున్నారు. 

హైదరాబాద్ కేంద్రంగా కొనసాగిన ఓ జాయింట్ కమిషనర్ ఓ సంస్థ నుంచి దాదాపు రూ.8 కోట్ల వరకు లబ్ధిపొంది నిందితులు అరెస్టు కాకుండా కాపాడారనే విమరలు కూడా ఉన్నాయి. ఇప్పటివరకుదాదాపు రూ.11 కోట్లను రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ర్టంలో 1800 బోగస్ వ్యాపార సంస్థలపై కొరడా ఝుళిపించిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు జీఎస్టీ చెల్లింపుల్లో మోసాలు, ఎగవేతల దారా ఆ కంపెనీలు రూ.2.289 కోట్లవరకు ప్రభుత ఆదాయానికి గండి కొట్టినట్ల్లు గుర్తించారు.