- హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బీఎల్‌ఎన్ రెడ్డి
- ఈడీ విచారణలో వెల్లడి
హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): ‘ఎలాంటి అనుమతులు లేకుండా ఎఫ్‌ఈవోకు ఎలా నిధులు బదిలీ చేశారు?’ అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అడిగిన ప్రశ్నకు మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి ‘ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ ఆదేశాల మేరకు రూ.54 కోట్లను ఎఫ్‌ఈవోకు బదిలీ చేశాం’ అని సమాధానమిచ్చినట్లు తెలిసింది.
ఫార్ములా ఈ రేస్ కేసులో బుధవారం మాజీ చీఫ్ ఇంజినీర్ ఆయన విచార ణకు హాజరు కాగా ఈడీ సుమారు ఆరు గంటల పాటు అనేక ప్రశ్నలు స0ంధించిం ది. ఉన్నతాధికారుల అనుమతులతోనే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా నిధులు ట్రాన్స్‌ఫర్ చేశామని, చెల్లింపుల్లో రూ.46 కోట్లు విదేశీ మారక ద్రవ్యం రూపంలో ఉన్నట్లు, రెండో దఫా రేసింగ్‌కు ఆటంకాలు ఉండకూడదనే ముందస్తు పేమెంట్లు చేసినట్లు బీఎల్‌ఎన్ రెడ్డి చెప్పారని తెలిసింది.
అడ్వాన్స్ చెల్లింపులు కాకపోతే రేస్ రద్దయ్యే అవకాశం ఉండేదని, రద్దు కాకూడదనే ఉద్దేశంతోనే డబ్బులు చెల్లించినట్లు చెప్పినట్లు సమాచారం. మొదటి దఫా రేసింగ్ నిర్వహించిన ఏఎస్ నెక్స్ట్ కంపెనీ ఆ తర్వాత పార్ట్‌నర్‌షిప్ నుంచి తప్పుకున్నదని, కంపెనీ భాగస్వామ్యం లేకపోవడంతో హెచ్‌ఎండీఏ నేరుగా రంగంలోకి దిగి డబ్బులు చెల్లించినట్లు తెలిసింది.
కాగా... ఈ కేసులో ఏ2 నిందితుడైన ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్‌ను ఈడీ విచారించనున్న తరుణంలో బీఎల్‌ఎన్ రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్ అత్యంత కీలకంగా మారనున్నది. బీఎల్‌ఎన్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా ఈడీ అర్వింద్ కుమార్‌ను విచారించనుంది. అయితే ఏసీబీ అధికారుల ముందు నాటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే చెల్లించినట్లుగా చెప్పిన అర్వింద్‌కుమార్ ఈడీ అధికారులకు సైతం అదే విషయాన్ని మరోసారి చెప్పే అవకాశం కనిపిస్తోంది.