హైదరాబాద్, సెప్టెంబర్ 23(విజయక్రాంతి): తెలంగాణ విజయ డెయిరీకి చెందిన పాడి రైతుల పాల బిల్లుల బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం సోమవారం రూ.50కోట్లను విడుదల చేసింది. పాల బిల్లుల చెల్లింపు విషయంలో జరిగిన ఆలస్యం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో తక్షణమే చెల్లించేందు సర్కారు ఈ మొత్తాన్ని విడుదల చేసింది. సకాలంలో పాల బిల్లులు చెల్లించడానికి, లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.