calender_icon.png 4 December, 2024 | 2:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రెసిడెన్సియల్ కాలేజీలకు 429కోట్లు విడుదల

10-11-2024 01:38:54 AM

హైదరాబాద్, నవంబర్ 9(విజయక్రాంతి): రాష్ట్రంలో బీసీడబ్ల్యూ రెసిడెన్షియల్ సొసైటీకి బీసీ సంక్షేమ శాఖ రూ.429.6కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2024 ఆర్థిక సంవత్సరంలోని ఖర్చుల కోసం ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలోని బీసీ సంక్షేమ శాఖ పరిధిలోకి వచ్చే జూనియర్, హై స్కూల్ రెసిడెన్షియల్ కాలేజీలకు ఈ నిధులను వినియోగించనున్నారు.