హైదరాబాద్, జనవరి 18(విజయక్రాంతి): పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించే గృహజ్యోతి పథకం అమలుకు డిస్కంలకు ప్రభుత్వం రూ.125కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు శనివా రం విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి నెలకు గానూ మొత్తాన్ని విడుదల చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.