హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ డిస్కంలకు విద్యుత్ శాఖ రూ.180 కోట్లను విడుదల చేసింది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్ అందించడానికి ప్రభుత్వం నవంబర్ నెలకు ఈ మొత్తాన్ని విడుదల చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ.1,612 కోట్లను కేటాయించింది.