calender_icon.png 4 January, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ సబ్సిడీకి 4,791 కోట్లు విడుదల

02-11-2024 12:59:01 AM

ఐదు నెలల టారీఫ్‌ను విడుదల చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): 2024 నవంబర్ నుంచి 2025 మార్చి వరకు ప్రభుత్వం లబ్ధిదారులకు సబ్సిడీ కింద చెల్లించే టారీఫ్ మొత్తాన్ని సర్కారు ఒకేసారి విడుదల చేసింది. విద్యుత్ సబ్సిడీ కింద టీజీట్రాన్స్‌కోకు శుక్రవారం రూ.4,791.65 కోట్లను చెల్లిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వం గృహజ్యోతితోపాటు ఇతరత్రా విద్యుత్ సబ్సిడీలను లబ్ధిదారులకు అందజేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఐదు నెలల కాలానికి సబ్సిడీని ఒకేసారి విడుదల చేసింది. వాస్తవానికి గతంలో ఏ నెల సబ్సిడీ ఆ నెలనే ప్రభుత్వం విడుదల చేసేది. కానీ ఇప్పుడు అడ్వాన్స్‌గా టారీఫ్‌లను చెల్లించడం విశేషం.