హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు సంబంధించి మధ్యా హ్న భోజనం వంట ఖర్చులకు రూ.8.74 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈమేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2024 విద్యాసంవత్సరానికి ఈ నిధులను విడుదల చేసినట్లు అందులో పేర్కొన్నారు.