calender_icon.png 8 October, 2024 | 5:09 AM

స్కాలర్‌షిప్ 1,502 కోట్లు విడుదల

08-10-2024 02:48:54 AM

బీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్

ఉత్తర్వులు జారీచేసిన బీసీ సంక్షేమ శాఖ

హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): బీసీ, ఈబీసీ క్యాటగిరిలో ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్  కోర్సు లు చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన స్కాలర్‌షిప్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. దీనికిగానూ రూ. 1,502 కోట్లు విడుదల చేస్తూ బీసీ సంక్షేమ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని స్కాలర్‌షిప్ పథకానికి సంబంధించి 2023-24 విద్యా సంవత్సరం వరకు బీసీ, ఈబీసీ విద్యార్థుల కోసం ఈ నిధులు విడుదల చేసినట్టు పేర్కొంది. నాన్ ప్రొఫెషనల్ కోర్సుకు చెందిన పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్ కింద రూ. 112.80 కోట్లు, రూరల్ టెక్నాలజీ ఫండ్ స్కాలర్‌షిప్ కింద రూ. 224.96 కోట్లు, నాన్ ప్రొఫెషనల్ కోర్సుకు చెందిన ఆర్టీఎఫ్ స్కాలర్‌షిప్ కింద రూ.704.87 కోట్లు, ఈబీసీ స్కాలర్‌షిప్ కింద రూ. 273.29 కోట్లు, ఈబీసీ నాన్ ప్రొఫెషనల్ కోర్సులకు చెందిన స్కాలర్‌షిప్ కింద రూ. 155.75 కోట్లు, ఇతర స్కాలర్‌షిప్‌లకు రూ.31.15 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు.