calender_icon.png 19 November, 2024 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూలు డిపోకు రూ.50కోట్లు

19-11-2024 02:29:30 AM

ఉత్తర్వులు మంజూరు చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి) : రాజన్న సిరిసిల్ల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న నూలు డిపో నిర్వహణకు రూ.50 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుం ది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి శ్రీధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే తదుపరి చర్య లు తీసుకోవాలని బీసీ సంక్షేమశాఖ కమిషనర్‌ను ఆదేశించారు.