calender_icon.png 2 October, 2024 | 8:12 AM

రాష్ట్రానికి 416 కోట్లు!

02-10-2024 03:04:57 AM

వరద సాయం కింద మొత్తం రూ. 5,858 కోట్లు

14 రాష్ట్రాలకు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయ క్రాంతి) : ఇటీవల అకాల వర్షాలు, వరద కారణంగా ప్రభావితమైన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం వరద సాయం ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం రూ. 5,858.60 కోట్లను 14 రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ఈ నిధుల్లో మహారాష్ట్రకు అత్యధికంగా రూ.1,492 కోట్లను కేటాయించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.1,036 కోట్లు, అస్సాంకు రూ.716 కోట్లు, బీహార్‌కు రూ. 655.60 కోట్లు, గుజరాత్‌కు రూ.600 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ. 416.80 కోట్లు విడుదల చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌కు రూ. 189.20 కోట్లు, కేరళకు రూ.145.60 కోట్లు, మణిపూర్ రూ. 50 కోట్లు, మిజోరంకు రూ.21.60 కోట్లు, నాగాలాండ్‌కు రూ.19.20 కోట్లు, సిక్కిం రాష్ట్రానికి రూ.23.60 కోట్లు, త్రిపురకు రూ.25 కోట్లు, పశ్చిమబెంగాల్‌కు రూ. 468 కోట్లు విడుదల చేసింది.