- ఉమ్మడి వరంగల్‌లో 7 రోడ్లకు నిధులు విడుదల
- కాకతీయ టెక్స్‌టైల్ పార్కుకు పీహెచ్‌సీ మంజూరు
హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): వరంగల్ పర్యటనకు మం గళవారం సీఎం రేవంత్‌రెడ్డి రానున్న నేపథ్యంలో ఉమ్మ డి జిల్లాలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులను విడుదల చేసింది. వరంగల్ ట్రైసిటీ సహా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7 రోడ్ల అభివృద్ధికి రూ.364 కోట్లు విడుదల చేస్తూ ఏడు ప్రత్యేక జీవోలను జారీ చేసింది.
ఇప్పటికే మామునూరు ఎయిర్‌పోర్ట్ భూసేకరణ కోసం రూ.205 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. ఆర్‌అండ్‌బీ శాఖ నుంచి రూ.569కోట్లు విడుదల అయ్యాయి.
టెక్స్‌టైల్ పార్క్‌కు పీహెచ్‌సీ..
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ టౌన్‌షిప్ వద్ద వైద్య సేవలు అందించేందుకు సర్కారు సిద్ధమైంది. అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ఏర్పాటుకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం సీఎం పీహెచ్‌సీ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు.