calender_icon.png 24 September, 2024 | 3:59 AM

హుస్నాబాద్ అభివృద్ధికి 60 కోట్లు

24-09-2024 01:52:52 AM

  1. రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి వినియోగం
  2. మంత్రి పొన్నం వెల్లడి

కరీంనగర్(విజయక్రాంతి)/భీమదేవరపల్లి, సెప్టెంబర్ 23: కరీంనగర్ జిల్లా హు స్నాబాద్ నియోజవర్గంలో రోడ్లు, బ్రిడ్జిల ని ర్మాణం కోసం రూ.60 కోట్లు మంజూరు అ య్యాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్ర భాకర్ వెల్లడించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ ప్ర జాగ్రంథాలయంలో సోమవారం రాత్రి మీ డియా సమావేశంలో పొన్నం ప్రభాకర్ మా ట్లాడారు. పంచాయతీ రాజ్ ఎంఆర్‌ఆర్ గ్రా ంట్ కింద రూ.10 కోట్లు, పంచాయతీ రాజ్ గ్రాంట్ సీఆర్‌ఆర్ గాంట్ల కింద రూ.50 కో ట్లు మంజూరయినట్లు తెలిపారు. ఈ నిధులతో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రోడ్ల మరమ్మతు, బ్రిడ్జిల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. మంత్రి వెంట కొమురవెళ్లి చంద్రశేఖర్‌గుప్తా, కొలుగూరి రాజు, ఆదరి ర విందర్, పిడిశెట్టి కనుకయ్య,చిదురాల స్వరూ ప, చిట్టంపల్లి అయిలయ్య తదితరులున్నారు. 

విద్యార్థులు శ్రద్ధతో చదవాలి

హనుమకొండ, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా గోపాల్‌పూర్ నుంచి ఎల్కతుర్తి వెళ్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ మార్గమధ్యంలో బస్సు ఎక్కుతున్న ఎల్కతుర్తి మోడల్ స్కూల్ విద్యార్థులను చూసి కాన్వాయ్‌ను నిలిపి వారితో కాసేపు ముచ్చటించారు. శ్రద్ధతో చదువుకుని ఉన్నత స్థాయికి రావాలని సూచించారు. తల్లిదండ్రులకు పేరు తేవాలని చెప్పారు. పాఠశాలలో సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.