calender_icon.png 21 January, 2025 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగుల సాధికారిత శాఖకు రూ.1225 కోట్లు

24-07-2024 01:33:35 AM

న్యూఢిల్లీ, జూలై 23: దివ్యాంగుల సాధికారిత శాఖకు కేంద్ర బడ్జెట్‌లో రూ.1,225.27 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది గత బడ్జెట్‌లో కేటాయించిన రూ.1,225.01 కోట్లతో పోలిస్తే 0.02 శాతం స్వల్పంగా పెరిగింది. వివిధ పథకాలు, ప్రాజెక్ట్‌ల ద్వారా దివ్యాంగుల జీవితాలను మెరుగుపరిచే లక్ష్యంతో కీలక కార్యక్రమాల కొనసాగింపు, విస్తరణను చేపట్టనున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. ఈ నిధుల్లో దివ్యాంగులకు సహాయం కోసం రూ.315 కోట్లు, ఉపకరణాల కొనుగోలుకు రూ.305 కోట్లు కేటాయించారు. దీన్‌దయాళ్ దివ్యాంగుల పునరావాస పథకానికి రూ.165 కోట్లు, దివ్యాంగుల చట్టం అమలుకు రూ.135 కోట్లు కేటాయించారు.

దివ్యాంగ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం రూ.142.68 కోట్లు కేటాయింపులు జరిపారు. అదేవిధంగా సెంటర్ ఫర్ డిసేబిలిటీ స్పోర్ట్స్ నిధులను రూ.76 కోట్ల నుంచి రూ.25 కోట్లకు తగ్గించారు. నేషనల్ హ్యాండిక్యాప్డ్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఆర్టిఫీషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు రూ.194 కోట్లు కేటాయించారు. అదేవిధంగా వివిధ విభాగాలకు నిధులను కేటాయించారు.