20-03-2025 12:38:50 AM
రాష్ట్ర మొత్తం బడ్జెట్‌లో 13.19 శాతం
హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్సీ సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. మొత్తం రూ.3,04,965 కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 40,232 కోట్లు ఎస్సీ సంక్షేమాభివృద్ధికే కేటాయించడం విశేషం. ఇది రాష్ట్ర మొత్తం బడ్జెట్‌లో 13.19 శాతంగా నమోదైంది. ఇక గత 2024-24 వార్షిక బడ్జెట్‌లో ఎస్సీ సంక్షేమాభివృద్ధికి రూ.33,124 (11.37శాతం) కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోల్చుకుంటే ఈసారి 1.82 శాతం కేటాయింపులు పెంచారు. గతేడాదితో పోలిస్తే ఈ బడ్జెట్‌లో రూ.7,108 కోట్లు అదనంగా నిధులు కేటాయించారు.